నీరవ్ మోదీని అప్పగించండి : సీబీఐ

17:42 - August 20, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోది ఆచూకి లభించింది. అతను బ్రిటన్‌లో ఉన్నట్లు సిబిఐ అధికారులు ధృవీకరించారు. నీరవ్‌ మోదిని తమకు అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖకు సిబిఐ విజ్ఞప్తి చేసింది. నీరవ్‌ మోదిని స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ సహకారంతో తన ప్రతినిధులను బ్రిటన్‌కు పంపనుంది. ఇంటర్‌పోల్‌ ద్వారా జారీ చేసిన రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ ఆధారంగా నీరవ్‌ మోదిని అదుపులోకి తీసుకునేందుకు అనుమతించాలని సిబిఐ బ్రిటన్‌ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జూన్‌లో నీరవ్‌మోదీకి రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేశారు. నీరవ్‌మోది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 14,600 కోట్లకు కుచ్చుటోపి పెట్టారు. ఈ స్కామ్‌లో మరో నిందితుడు నీరవ్‌ మోది మామ మెహుల్‌ చోక్సీ ఆంటిగ్వాలో పౌరసత్వం పొందాడు.

Don't Miss