రోహిత్ మృతిపై సీఎం కేసీఆర్ స్పందించలేదు: హనుమంతరావు

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. వన్ టు వన్ విత్ శ్రీధర్ బాబు కార్యక్రమంలో హనుమంతరావు తన అంతరంగాన్ని వివరించారు. హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరిగాయని.. జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సెంట్రల్ వర్సటీని సందర్శించి.. ఘటనపై మాట్లాడారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఘటనపై ఎలాంటి స్టేట్ మెంట్ కానీ.. సందర్శన కానీ చేయకపోవడం శోచనీయమన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే…

సెంట్రల్ విద్యార్థి చనిపోతే కేసీఆర్ చూడడానికి వెళ్లలేదు. వర్సిటీలో జరుగుతున్న వివక్ష, అణచివేత, అవమానాలపై విద్యార్థులు నా దగ్గరకు వచ్చి కేంద్రానికి లేఖ రాయమని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు నేను 2014, నవంబర్ 17 న కేంద్రానికి లేఖ రాశాను. అప్పుడు కేంద్రం స్పందించి ఉంటే.. రోహిత్ ఆత్మహత్య చేసుకునే వాడు కాదు. హెచ్ సీయూ ఎబివిపికి అడ్డగా మారింది. గ్రామాల్లో సోషల్ బైకాడ్ ఆగిపోయింది..కానీ యూనివర్సిటీలో సోషల్ బైకాడ్ జరగడం దారుణం. మొదటగా వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలి.

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. 2019 లో గెలుపు కాంగ్రెసు ది. కొత్తగా అబద్దాలు చెప్పే అవసరం మాకు లేదు. గత పదేళ్లలో మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. టిఆర్ ఎస్ ప్రభుత్వం రుణ మాఫీ పూర్తిగా కాలేదు' అని చెప్పారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

Don't Miss