పౌష్టికాహారం తినండి...

10:59 - April 10, 2017

ఆహారంలో శ్రద్ధ వహించకపోతే శరీరంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. నిత్యం ఏదో ఒకరమైన అనారోగ్యంతో బాధ పడుతుంటుంటారు. ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహించాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. పౌష్టికాహారం తినడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.
క్యాలీ ఫ్లవర్ లో ఎక్కువగా మినరల్స్..విటమిన్స్..న్యూట్రీన్స్..యాంటి ఆక్సిడెంట్ లతో పాటు క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. అధికరక్త పోటును అదుపులో ఉంచుతుంది. క్యాలీ ఫ్లవర్ లో ముఖ్యంగా విటమిన్ సి, కె, ప్రోటీన్లు, మెగ్నీషియం, పోటాషియం, పాస్పరస్, మాంగనీస్ వంటి పోషకాలు చాలా ఉంటాయి.
ఆకుకూరలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఎక్కువగా విటమిన్ సి, ఏ, కెలు సమృద్ధిగా లభిస్తాయి. శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి. ఐరన్ ఎక్కువ శాతం కూడా ఉంటుంది.
బాదం..బీన్స్..శనగలు..చిక్కుడు వంటి గింజల్లో ప్రోటీన్స్..ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది.

Don't Miss