రాహుల్ ఓయూ విజిట్..అప్పుడే దుమారం...

16:08 - August 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో..హైదరాబాద్ లో 'రాహుల్' అడుగు పెట్టకముందే వేడి రాజుకుంది. ఓయూలో రాహుల్ పర్యటనకు నిరాకరించడంతో మళ్లీ కాంగ్రెస్..టీఆర్ఎస్ మధ్య మాటలతూటాలు పేలే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు 'రాహుల్ గాంధీ' హైదరాబాద్ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఈనెల 14వ తేదీన ఓయూలో ఓ సదస్సులో ఆయన పాల్గొనేందుకు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కానీ రాహుల్ ను ఓయూలోకి అనుమతినివ్వొద్దంటూ కొన్ని విద్యార్థి సంఘాలు హోం మంత్రి నాయినీని కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించే సదస్సుకు అనుమతినివ్వాలంటూ పలువురు విద్యార్థులు శుక్రవారం ఓయూ అధికారులను కోరారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా యూనివర్సిటీ అధికారులు అనుమతిని నిరాకరించారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సభకు అనుమతిని నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్తామని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్లే అనుమతిని నిరాకరించారని పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss