ఆఫీసర్ మరో టీజర్ రెఢీ..

17:50 - May 3, 2018

వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగ్ కాంబినేషన్ లో వచ్చిన శివ నాగార్జున కెరియర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ ఇచ్చింది. అప్పటి నుండి వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో అంతటి హిట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ దర్శక నిర్మాతగా రూపొందించిన 'ఆఫీసర్' అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. దాంతో రేపు సాయంత్రం 6 గంటలకు మరో టీజర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉండేలా వర్మ జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'శివ'ను మించి ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడంతో, అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.

నాగ్ సరసన మైరా సరీన్..
నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన మైరా సరీన్ కనిపించనుంది. నాగార్జున పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా నుంచి, ఇంతకు ముందు ఒక యాక్షన్ టీజర్ ను వదిలారు. ఆ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

 

Don't Miss