పారిశుద్ధ్యం పేరుతో రైల్వే నిర్వాకం..

14:40 - September 27, 2018

ఢిల్లీ : రైల్వే అధికారుల ఆలోచనా తీరు ఎలా వుందీ అంటే వేలు కాలితే కాలు తీసేసిన చందంగా వుంది. సమ్యలుంటే పరిష్కరించాల్సింది పోయి ఆ సమస్యను మరింతగా జటిలం చేసేలా రైల్వే అధకారుల తీరు వుంది. సాధారణంగా రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగించేందుకు మరింతగా కృషి చేస్తారు. కానీ మన రైల్వే అధికారులు మాత్రం డిఫరెంట్. రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం కోసం మన అధికారులు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ పరిశుభ్రత కేటగిరిలో మంచి ర్యాంకు పొందిన ఓల్డ్ ఢిల్లీ అధికారుల నిర్ణయంపై పబ్లిక్ నుండి తవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాయ్ లెట్ల పరిశుభ్రతగా వుండేందుకు రాత్రిపూట టాయిలెట్లను మూసేయాలని నిర్ణయించారు. నిత్యం ప్రయాణికులు వెళుతూ ఉండే ఈ స్టేషన్ లో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ స్టేషన్ లో మరుగుదొడ్లను మూసేస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అధికారుల నిర్ణయంతో అసలు మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన ఉద్దేశమే దెబ్బతింటోందని ప్రజలు వాపోతున్నారు.

 

Don't Miss