'ఓం నమో వెంకటేశాయ' రివ్యూ

18:57 - February 10, 2017

అన్నమయ్య శ్రీ రామదాసు లాంటి చరిత్రలో నిలిచిపోయే భక్తిరస చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చివరి సినిమా అంటూ ఓం నమో వెంకటేశాయను తెరకిఎక్కించారు. నాగార్జున రాఘవేంద్రరావు ల సక్సస్ఫుల్ కాంబినేషన్ లో మహేష్ రెడ్డి నిర్మించిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

కధ విషయానికి వస్తే శ్రీవారి పరమ భక్తుడు హాథీరాం బావాజీ జీవిత చరిత్రను తెరకెక్కించారు అయితే అయన చరిత్రకు సంబంధించిన నిజానిజాలు ఆధారాలు తక్కువగా ఉండటం తో ఎక్కువ భాగం కల్పితం గా మలచాల్సి వచ్చింది .హాథిరామ్ బావాజీ చిన్న తనం నుండి దేవుడిని చూడాలని గురువు దగ్గర విద్యను అభ్యసించి కఠోర తపస్సు చేస్తాడు అయితే ఆ తపస్సుకి మెచ్చి వచ్చిన వెంకటేశ్వర స్వామి ని గుర్తించలేక వెళ్లిపొమ్మంటాడు ..తరువాత జరిగిన తప్పు తెలుసు కొని తిరుమలకు తిరిగి వెళతాడు .కానీ అతని అవతారం ఆహార్యం చూసి పిచ్చోడిగా అందరూ భ్రమపడతారు కానీ కృష్ణమ్మా మాత్రం అతనిలోని భక్తుడిని గుర్తించి ఆశ్రయం కలిపిస్తుంది .ఆ తరువాత హాథిరామ్ బావాజీ తిరుమలలో ఎం చేసాడు .శ్రీవారికి ఎందుకంత ప్రియభక్తిడిగా మారాడు, శ్రీ వారితో పాచికలాట వెనక పరమార్ధం ఏంటి ? చివరికి ఏమయ్యాడు అనే మూల కధని ఆసక్తికరంగా తనదైన శైలిలో చెప్పాడు డైరెక్టర్ రాఘవేంద్రరావు.

టీనటుల విషయానికి వస్తే ఈ సినిమా కర్త కర్మ క్రియ నాగార్జున అనే చెప్పాలి.మొద్దని ఫ్రేమ్ నుండి క్లైమాక్స్ వరకు ఎక్కడ నాగార్జునని చూస్తున్నామని ఫీలింగ్ కలగాకుండా హాథిరాంబావాజీ నే చూస్తున్నామని అనిపించేలా పాత్రలో ఒదిగిపోయాడు .ఆహార్యం ,డైలాగ్ డెలివరీ ఇలా ప్రతివిషయం లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు .ఇక అనుష్క విషయానికి వస్తే పూర్తిగా కల్పిత పాత్ర కావడం తో చాలా షేడ్స్ చూపించడానికి ట్రై చేసారు .అనుష్క కూడా పాత్రకు పూర్తి న్యాయం చేసింది .ఆమె నటనలో కానీ ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఎక్కడ వంక పెట్టడానికి లేదు కాకపోతే ఆమె శరీరం లోని భారీతనం ఆమెకు కూడా భారంగా నే తయారైంది . ప్రజ్ఞ జైస్వాల్ జగపతిబాబులు పాత్ర పరిధిమేరకు బాగానే చేసారు .ఇక శ్రీవారిగా నటించిన సౌరబ్ జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి .అతను పలికించిన హావభావాలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దిగివచ్చాడా అన్నట్టు అనిపించాడు.శ్రీదేవి భూదేవి గా నటించిన విమల రామన్, అస్మిత పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు .రావు రమేష్ తన మేనరిజానికి పూర్తి విరుద్ధంగా విభిన్నమైన పాత్రను పోషించారు .మిగతా సీనియర్ నాటినటులంతా ఆకట్టుకున్నారు .

టెక్నిషన్స్ విషయానికి వస్తే సినిమా కి ప్రాణం గా నిలిచాడు సంగీత దర్శకుడు కీరవాణి .పాటలపరంగా కొంత మేరకే ఆకట్టుకున్న కీరవాణి ఆర్ ఆర్ పరంగా 100 శాతం న్యాయం చేసాడు ముక్యంగా క్లైమాక్స్ సీన్స్ అయితే అతని ఆర్ ఆర్ వలన ప్రతి ప్రేక్షకుడి కంట్లో నీళ్లు తిరుగుతాయి. కెమెరామన్ ఎస్ గోపాల్ రెడ్డి కష్టం నిజాయితీ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. కష్టమైన లొకేషన్స్ లో కూడా చాల వైవిధ్యమైన ఫ్రేమింగ్ తో అలరించాడు ముఖ్యంగా విశ్వరూప దర్శనం వంటి ఫ్రేమ్ లలో గోపాల్ రెడ్డి ప్రతిభ ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. అలానే ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ చాల రియలిస్టిక్ సెట్టింగ్స్ తో నాలుగు వందల సంవత్సరాల క్రితం తిరుమల ఎలా ఉండేదో అలానే చూపించారు. దానివల్ల సినిమాకి మంచి ఫీల్ వచ్చింది. ఇక ఇరవై నాలుగు విభాగాలను అనుసంధానం చేస్తూ తన మొత్తం ఎక్సపీరియన్సు ను అంత వాడి టెక్నికల్ గా కూడ అప్డేట్ అయ్యి రాఘవేంద్రరావు గారు తెరకు ఎక్కించిన ఈ సినిమా అయన గత చిత్రాలతో పోలిస్తే ఒక అద్భుత దృశ్య కావ్యం గా నిలిచిపోయింది

ఓవర్ అల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఫీల్ పరంగా అన్నమయ్యను కూడా దాటేసింది అనే ఒప్పుకోవాలి అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు అతిశయోక్తి అనిపించే సన్నివేశాలు ఉన్న కూడా ఓవర్ అల్ గా మాత్రం ప్రతి ప్రేక్షకుడికి భక్తి రసాత్మక అనుభూతిని ఇస్తుంది ఓం నమో వెంకటేశాయ ..

 

ప్లస్ పాయింట్స్

నాగార్జున

డైరెక్షన్

కెమెరా పనితనం

బ్యాగ్రౌండ్ మ్యూజిక్

నిర్మాణ విలువలు

 

మైనస్ పాయింట్స్

కొన్ని కల్పిత దృశ్యాలు

ఎలివేట్ కాని కామెడీ ట్రాక్

 

రేటింగ్ 3/5

Don't Miss