అజిత్ దోవల్ పై ఓంపురి ఆత్మ పగ..

10:22 - April 19, 2017

మనిషి మృతి చెందిన అనంతరం ఆత్మ పగ తీర్చుకుంటుందా ? ఆత్మలున్నాయా ? సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఇంకా మూఢనమ్మకాలు వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా పాక్ కు చెందిన ఓ మీడియా తలా తోక లేని కథనం ప్రసారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు ఓంపురి ఆత్మ ముంబైలో తిరుగుతోందని..భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పై పగ తీర్చుకొనేందుకు ఆత్మ తిరుగుతోందని బోల్ న్యూస్ టీవీ ఛానెల్ వీడియోను ప్రసారం చేసింది. బాలీవుడ్ లోనే కాక ఇతర వుడ్ చిత్రాల్లో నటించిన ఓంపురి గత జనవరి 6వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. యూరీ సెక్టార్ లో దాడుల విషయంలో ఓపుంరి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓ కథనం ప్రసారం చేసింది. దీనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అయిన ఈ వీడియోలో తెల్ల కుర్తా ధరించిన వ్యక్తి కనిపించగా..అది ఓంపురి ఆత్మ అని..ముంబైలోని తన ఇంటి ముందు తిరుగుతోందని బోల్ న్యూస్ ఛానెల్ పేర్కొంది. గత జనవరి 14న ప్రసారం చేయగా దీనిని 'ఆజ్ తక్' అనే న్యూస్ ఛానెల్ ఇటీవలే ప్రసారం చేసింది.

Don't Miss