ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన..

19:59 - December 28, 2016

గుంటూరు : నరసరావుపేటలో శ్రీ డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన ఈరోజు ప్రారంభమైంది. స్పీకర్‌ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి రావెల కిశోర్ బాబు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఒకటో తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనకు అనేక రాష్ట్రాల నుంచి ఎద్దులను తీసుకువచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు సంబంధించిన వస్తువుల స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.

Don't Miss