ఉల్లిపొట్టుతో .. పట్టులాంటి జుట్టు

12:50 - October 20, 2017

సాధారణంగా మనకు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉండనే ఉంది. మరి ఉల్లి పొట్టు కూడా ఈ సామెతకు సరిగ్గా సరిపోతుందని చెప్తున్నారు మన శాస్తవేత్తలు. అదేంటో చూద్దాం...

ఉల్లిపాయను వాడుకునేటపుడు దానిపై ఉండే పట్టును తీసి పడేస్తుంటాము. కానీ ఉల్లిపట్టును కొన్ని నీళ్లలో వేసి మరగపెట్టి.. వడపోసి ఆ నీటిని తలస్నానం చేసిన తరువాత తలపై పోసుకుంటే జుట్టు పట్టులా మెరుస్తుంది. అంతేకాదు.. బాగా ఒత్తులా తయారువుతుంది.

హైపర్ టెన్షన్, ఒబేసిటీ తగ్గించడంలో...

అంతే కాదండోయ్.. ఉల్లిపాయ పొట్టుతో, హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు మరియు ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ పొట్టు హైపర్ టెన్షన్ మరియు ఓబేసిటిని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది, దీన్ని రోజూ ఉపయోగిస్తే మంచిది. ఈ రెమెడీతో పాటు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే హైపర్ టెన్షన్, ఓబేసిటి తగ్గించుకోవచ్చు. రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తుంటే, ఈ హోం రెమెడీ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు క్యుర్సిటిన్ అనే ఎంజైమ్ ధమనులను రక్తాన్ని వడపోయడంలో, రక్తప్రసరణ మెరుగ్గా ఉంచడంతో హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు. ఈ రెండు న్యూట్రీషియన్స్ జీవక్రియల రేటును పెంచుతాయి.దాంతో శరీరంలో కొవ్వు తగ్గి, ఊబకాయన్ని తగ్గిస్తుంది.

Don't Miss