పల్టీలు కొడుతూ బస్సు లోయలోకి...

15:54 - June 14, 2018

చిత్తూరు : కూనూరు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఓ బస్సు ఊటీ నుండి కూనూరు మీదుగా కోయంబత్తురూకు వెళ్లాల్సి ఉంది. మరికాసేపట్లో కూనూరు స్టేషన్ చేరుకుంటుందనగా బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. సుమారు వంద అ అడుగుల లోతులో పడిపోవడంతో ఏడుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. సుమారు 15 మందికి గాయాలయ్యాయి. మలుపులు తిరుగుతూ ఉండే ఈ రహదారిపై జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది. బాగా నిపుణులైన..సుశిక్షితులైన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడుపుతుంటారు. మరి ఈ బస్సు ఎలా ప్రమాదానికి గురైంది ? అనేది తెలియరావడం లేదు. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో బస్సు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Don't Miss