మార్కెట్లో ఒప్పొ ‘రియల్‌ మి 2 ప్రొ’...

14:20 - September 28, 2018

హైదరాబాద్ : స్మార్ట్ ఫోన్..ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా వివిధ ఫీచర్లతో...వివిధ కంపెనీల ఫోన్లు కనిపిస్తుంటాయి. రోజుకో ఫీచర్‌తో విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వివిధ కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ కంపెనీ ఒప్పొ మరో ఫోన్‌ను మార్కెట్లలో విడుదల చేసింది. ‘రియల్‌ మి 2 ప్రొ’ పేరు పెట్టింది. ఇక దీని విశేషాలకు వెళితే...

  • ప్రారంభ ధరను రూ.13,999. 
  • 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే. 
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ముందు 16ఎంపీ, వెనుక 16ఎంపీ.
  • 2ఎంపీ కెమేరాలున్నాయి. 
  • 8 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజీ. 
  • ఓరియో 8.1, 3500 ఎంఎహెచ్‌ బ్యాటరీ. 
  • 1.8గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌. 

ఎస్‌డీ కార్డు సహాయంతో దీనిని 256 జీబీకి విస్తరించుకునే సదుపాయం ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ ఫీచర్‌తో పోట్రెయిట్‌ మోడ్‌లో ఫొటోలు తీయవచ్చని కంపెనీ పేర్కొంది. 

Don't Miss