కల్వకుర్తిలో సీఎం కేసీఆర్‌ ఫొటోకు పాలాభిషేకం

13:12 - July 30, 2017

నాగర్‌కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని... సీఎంకు జీవితాంతం రుణపడిఉంటామని తెలిపారు. 20వేలమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో కేసీఆర్‌ వెలుగులు నింపారని హర్షం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్‌పై నిన్న కేసీఆర్‌ సంతకం చేశారు.

 

Don't Miss