కేంద్ర కేబినెట్..పలు నిర్ణయాలు

20:12 - September 12, 2017

ఢిల్లీ : హస్తినలో కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో నరసన్నపేట నుండి రణస్థలం వరకు 54 కిలోమీటర్ల వరకు 6లేన్లతో రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం 14వందల 63కోట్లు ఖర్చు చేయనున్నారు. కలకత్తా ..చెన్నై కారిడార్‌ విస్తరణలో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు. దీని ద్వారా ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కానున్నాయి. వీటితో పాటు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1శాతం అదనపు డీఏకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జులై 1, 2017 నుండి అదనపు డీఏ వర్తిస్తుంది. అలాగే గ్రాట్యుటీ చెల్లింపు గరిష్ట పరిమితిని పెంచే చట్ట సవరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
7వ వేతన సంఘం సిఫారసు మేరకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితి. ప్రస్తుతం అమలులో ఉన్న 4శాతం డీఏకి ఒక శాతం అదనంగా చెల్లించనుంది. 61 లక్షల పెన్షనర్లు, 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రూ.10 లక్షల నుండి 20 లక్షల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Don't Miss