మోడీ చేసిన 'ఆ' వ్యాఖ్యలు కట్...

17:50 - August 10, 2018

ఢిల్లీ : గురువారం రాజ్యసభ డిప్యూటి ఛైరన్‌ పదవికి జరిగిన ఓటింగ్‌ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ అభ్యర్థి హరిప్రసాద్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా హరి ప్రసాద్ పోటీపడ్డారు. రాజ్యసభలో హరివంశ్‌కు శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. మోది వ్యంగంగా చేసిన వ్యాఖ్యలపై హరిప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని, సభ హుందాతనానికి భంగం కలిగించారని హరిప్రసాద్ ఆరోపించారు. దీంతో మోదీ ప్రసంగం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియేట్ ప్రకటించింది. 

Don't Miss