షింజో అబే దంపతులకు మోది ఘనస్వాగతం

21:52 - September 13, 2017

గుజరాత్ : రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే దంపతులకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్రమోది ఘనస్వాగతం పలికారు. షింజో అబేను మోది ఆలింగనం చేసుకుని స్వాగతించారు. అబే పర్యటన కోసం ప్రత్యేక స్వాగతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. రోడ్ షో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకు 8 కిలోమీటర్ల మేర సాగింది. సబర్మతీ నదీ తీరాన ఏర్పాటు చేసిన వేదికపై పలువురు కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు. విదేశి ప్రధానమంత్రితో కలిసి భారత ప్రధాని రోడ్‌ షో నిర్వహించడం ఇదే తొలిసారి. రోడ్‌ షో సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.  5 వందల ఏళ్ల కాలం నాటి సిద్ధి సయీద్‌ మసీదును షింజో అబే సందర్శించనున్నారు.  గురువారం అహ్మదాబాద్ - ముంబై మ‌ధ్య తొలి హైస్పీడ్ రైలు ప‌నుల ప్రారంభ కార్యక్రమంలో షింజో అబే పాల్గొంటారు. షింజో అబేకు గుజరాతీ వంటకాలతో ఈ సాయంత్రం మోది ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

Don't Miss