హరివంశ్ కు నేతల అభినందనలు...

14:24 - August 9, 2018

ఢిల్లీ : గత కొన్నేళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా హరివంశ్‌ పనితీరును తాము చూశామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. రచయిత, సంపాదకుడు, బ్యాంకర్, రాజకీయ కార్యకర్తగా ఎంతో అనుభవం గడించిన ఆయన ఏ విషయమైనా రిసెర్చ్‌ చేసి చర్చించే వారని జైట్లీ తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయకుండా సభ నిబంధనలకు అనుగుణంగా హరివంశ్‌ పనిచేశారన్నారు. హరివంశ్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం ద్వారా సభా హుందాతనం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

రాజ్యసభలో డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నిక సుహృద్భావ వాతావరణంలో జరగడం అభినందనీయమని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపి రామ్‌గోపాల్‌ యాదవ్‌ అన్నారు. ఎన్డీయే తరపున పోటీ చేసిన హరివంశ్‌, విపక్షాల తరపున పోటీ చేసిన కాంగ్రెస్‌ ఎంపి హరిప్రసాద్‌ పరిపక్వత చెందిన వ్యక్తులని ఆయన కొనియాడారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సభ్యులకు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అంశాలు ప్రస్తావించాల్సి ఉంటుందని...ఈ విషయంలో సభాపతి హుందాగా ప్రవర్తించారని రామ్‌గోపాల్‌ యాదవ్‌ కోరారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. టీడీపీ కాంగ్రెస్‌ అభ్యర్థికి, టీఆర్‌ఎస్‌ ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశాయి. వైసీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. 

Don't Miss