పాలస్తీనాలో మోడీ..

21:04 - February 10, 2018

ఢిల్లీ : పాలస్తీనాను స్వతంత్ర దేశంగా చూడాలని ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా పాలస్తీనాకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదికి ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి మహమూద్‌ అబ్బాస్‌ను కలుసుకున్న అనంతరం ప్రధాని మోది సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత విదేశాంగ విధానంలో పాలస్తీనాకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. పాలస్తీనాలో శాంతి సుస్థిరతలను నెలకొల్పేందుకు భారత మద్దతు ఎప్పుడూ ఉంటుందని మోది స్పష్టం చేశారు. రమల్లాలో టెక్నికల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మోది ప్రకటించారు. పాలస్తీన అత్యున్నత పురస్కారం 'గ్రాండ్‌ కాలర్‌'తో మోదిని అబ్బాస్‌ సత్కరించారు. అంతకుముందు పాలస్తీనా ప్రధాని రమీ హమదల్లాహ్‌తో కలిసి పాలస్తీనా నేత యాసర్‌ అరాఫత్‌ సమాధి వద్ద మోది నివాళులర్పించారు. పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం.  

Don't Miss