దుబాయిలో మోడీ...

18:56 - February 11, 2018

ఢిల్లీ : దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఓపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత్ - యూఏఈ మధ్య ఎప్పట్నుంచో మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మోహముద్ బిన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు, ఇండియా నుంచి వచ్చిన సుమారు 30 లక్షల మందికి స్వంత దేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు.

Don't Miss