నీరవ్ మోదీకి రెడ్ కార్నర్ నోటీస్..అరెస్ట్ అయ్యేనా?..

12:25 - July 2, 2018

ఢిల్లీ : భారతదేశంలో వేలాది కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కున్న పలువురు విదేశాలకు చెక్కేసి హాయి ఎంజాయ్ చేస్తున్నా భారత ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా పట్టదు. ఈ క్రమంలో విజయ్ మాల్యా, నీవర్ మోదీ, లలిత్ మోదీ వంటి ఘరానా ప్రముఖులకు కొదవ లేదు. మాల్యాపై చర్యలు తీసుకుంటున్నామని నమ్మించిన కేంద్రం మాల్యా నుండి ఒక్క రూపాయి కూడా రాబట్టలేకపోయింది. కానీ ఇప్పుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి పంజాబ్ నేషన్ బ్యాంక్ ను మోసం చేసిన కూడా నీరవ్ మోదీ కూడా బ్రిటన్ కు పారిపోయాడు. ఈ విషయం తేటతెల్లంగా వినిపిస్తున్నా నీరవ్ మోదీ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు నీరవ్ మోదీ కి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. బ్యాంకులకు రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ రాజధాని లండన్ కు పారిపోయాడు. ఈ క్రమంలో నీరవ్ మోదీకి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీచేసింది. మొత్తం 192 దేశాల్లో సేవలందిస్తున్న ఇంటర్ పోల్, ఎక్కడ అరెస్టయినా, తమకు అప్పగించాలని ఇండియా కోరవచ్చు. అయితే, భారత్ తో సత్సంబంధాలు, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్న దేశాల్లో నీరవ్ అరెస్ట్ అయితే, సులువుగా ఇండియాకు రప్పించవచ్చు.మొత్తం 192 దేశాల్లో సేవలందిస్తున్న ఇంటర్ పోల్, ఎక్కడ అరెస్టయినా, తమకు అప్పగించాలని ఇండియా కోరవచ్చు. అయితే, భారత్ తో సత్సంబంధాలు, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్న దేశాల్లో నీరవ్ అరెస్ట్ అయితే, సులువుగా ఇండియాకు రప్పించవచ్చు.కాగా ఈ నోటిస్ మేరకు నీరవ్ మోదీపై చర్యలు తీసుకుంటారా లేదా? అనే విషయంపై వేచి చూడాల్సిందే. 

Don't Miss