విప్పర్రుకు జ్వరమొచ్చింది...

11:55 - November 11, 2017

పశ్చిమగోదావరి : ఆ గ్రామానికి జ్వరం వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా గ్రామంలోని 5వందల మంది జ్వరాలతో బాధపడుతున్నారు. గడచిన రెండు నెలల్లో రెండువేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంతకీ ఏ గ్రామం.. అక్కడ జ్వరాలకు కారణం ఏంటి? విప్పర్రులోని మంచినీటి చెరువులో నీరు కలుషితం కావడంతో గ్రామంలోని 5వందల మందికి విషజ్వరాలు సోకాయి. గడిచిన రెండునెలలుగా ఇదే పరిస్థితి. ఇప్పటి వరకూ 2 వేల మంది జ్వరాల బారిన పడినట్లు తెలుస్తోంది. ఇక చిన్నపిల్లలు సైతం జ్వరాల బారిన పడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్తుంటే చికెన్ గున్యా, టైఫాయిడ్, కీళ్ల జ్వరాలుగా డాక్టర్లు గుర్తిస్తున్నారు. గ్రామంలోని కలుషితనీరు తాగడం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో చెరువునీరే తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss