శాస్త్రవేత్త భార్గవ కన్నుమూత

10:36 - August 2, 2017

హైదరాబాద్ : సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్గవ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఉప్పల్‌ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పార్థివ దేహం ఉంచారు. భార్గవకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న రాజ‌స్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన భార్గవ 21 ఏళ్లకే సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. అయితే భార్గవ 2015లో పద్మభూషన్‌ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ప్రొఫెసర్‌ భార్గవ మృతిపట్ల జనవిజ్ఞాన వేదిక సంతాపం ప్రకటించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss