నేడు తేలనున్న కుల్ భూషణ్ భవిష్యత్..

09:23 - May 18, 2017

హేగ్ : మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు హేగ్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ కోర్టు తీర్పు వెల్లడించనుంది. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ తమ వాదనలు వినిపించాయి. ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్‌ను కిడ్నాప్‌ చేసి గూఢచర్యం ఆరోపణల కింద పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు ఉరిశిక్ష విధించిందని భారత్‌ వాదించింది. జాదవ్‌ ఉరిశిక్షను వెంటనే రద్దు చేయాలని భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. జాదవ్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని పాకిస్తాన్‌ ఆరోపించింది. జాదవ్‌ గూఢచర్యానికి పాల్పడ్డట్లు తమవద్ద ఆధారాలున్నయని పేర్కొంది. ఈ కేసులో కోర్టు తుదితీర్పుపై ఆసక్తిగా మారింది.

Don't Miss