కాల్పులు సద్దుమణిగాయి : పారికర్

21:59 - November 26, 2016

గోవా : జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో గత రెండు రోజులుగా కాల్పులు సద్దుమణిగాయని ర‌క్షణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తెలిపారు. జ‌వాను త‌ల న‌రికినందుకు ప్రతీకారంగా స‌రిహ‌ద్దులో భార‌త్ చేప‌ట్టిన దాడుల‌ను వెంటనే ఆపాల్సిందిగా పాకిస్థాన్ డిజిఎం ఫోన్‌ చేసి అభ్యర్థించారని మంత్రి పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఓ భార‌త జ‌వాను త‌ల న‌రికిన నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద ఉన్న పాక్‌పోస్టులపై ఇండియన్‌ ఆర్మీ ఉధృతమైన దాడులు చేయడంతో పాకిస్తాన్‌ వెనక్కి తగ్గిందని పారీకర్‌ చెప్పారు. అయితే కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న‌కు పాల్పడుతోంది మీరేన‌ని తాను గుర్తు చేసిన‌ట్లు ఆయన తెలిపారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

 

Don't Miss