రెండాకులు ఒక్కటవుతాయా ?

09:36 - August 11, 2017

చెన్నై : తమిళనాట రెండాకుల పంచాయితీ పరిష్కారందిశగా సాగుతోంది.. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి.. పళనిస్వామికి సీఎం పదవి, పన్నీర్‌ సెల్వానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు రెండువర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే రెండు టీంలు కలిసిపోనున్నాయని ప్రచారం జరుగుతోంది. శశికళ వర్గమైన దినకరన్‌కు పళనిస్వామి షాక్ ఇచ్చాక రెండువర్గాలమధ్య చర్చలు సానుకూలంగా సాగాయి.

పార్టీలో డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా దినకరన్‌ ఎన్నిక చెల్లదంటూ పళని తీర్మానం చేశారు.. ఈ నిర్ణయం తర్వాత పన్నీర్‌ కొంత శాంతించారు.. మొదటి నుంచీ శశికళ వర్గాన్ని వ్యతిరేకిస్తూవచ్చిన పన్నీర్‌ టీం... దినకరన్‌పై వేటు తర్వాత విలీనానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.. దీనిపై దినకరన్‌ వర్గీయులు కొంత ఘాటుగా స్పందిస్తున్నా.. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ధీటుగానే జవాబిస్తున్నాయి. ఇక విలీనం వార్తలు అన్నా డీఎంకే కార్యకర్తల్లో సంతోషం నింపుతున్నాయి.. సంబరాలు జరుపుకుంటున్న పార్టీ కేడర్‌ త్వరగా రెండు వర్గాలు కలిసే సమయంకోసం ఎదురుచూస్తున్నాయి.. 

Don't Miss