కల్వకుర్తి సీబీఎం ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్రచికిత్స

19:46 - December 21, 2017

నాగర్ కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సీబీఎం ఆస్పత్రిలో మహిళకు డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేసి యువతి కడుపులో నుంచి 8 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలం తిర్మలాపూర్ కు చెందిన సైదమ్మ (22) అనే యువతి కడుపు నొప్పితో కల్వకుర్తిలోని సీబీఎం ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కడుపులో కణితి ఉందని తేలడంతో ఆమెకు ఆపరేషన్ చేశారు. డా.వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. వైద్య పరిభాషలో ఈ కణితిని ఒబేరియన్ ట్యూమర్ గా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. కణితి తొలగించి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు బాధిత మహిళ సైదమ్మ కృతజ్ఞతలు తెలిపారు. 

 

Don't Miss