'పవన్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు'...

16:33 - February 8, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై లోక్ సత్తా నేత జయ ప్రకాష్ నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారని తెలిపారు. కానీ సమాజంలో మార్పు కోసం పవన్ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. బేగంపేటలోని లోక్ సత్తా కార్యాలయానికి 'పవన్' చేరుకున్నారు. అక్కడ జేపీతో భేటీ అయ్యారు. విభజన హామీలు అమలు కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి..జేఏసీ ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.

కాలు మీద కాలేసుకుని కూర్చొవచ్చు...
పవన్ కాలు మీద కాలేసుకుని బతుకొచ్చని..టాప్ స్టార్ గా లక్షలాది మంది డబ్బులు ఇచ్చి వెళుతారని..కోరి కష్టాలు తెచ్చుకుంటారని జేపీ తెలిపారు. సమాజం పట్ల ఎంత ప్రేమ ఉండడం..మంచి జరగాలనే తపన ఉండడం...ఏ సమాజం పెంచిందో..ఆ సమాజానికి న్యాయం జరగాలని కోరకుంటే ఇంత సాహసం అవసరమన్నారు. పదవులే పరమావధిగా భావించకుండా మార్పును వేగిరం చేయాలంటే ఏమి చేయాలి ? తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పవన్ తో చర్చించినట్లు తెలిపారు. పార్లమెంట్ లో లోతైన చర్చ జరిగిన తరువాత చట్టంలో పెట్టిన తరువాత కూడా ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. దేశ ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా నిర్ధిష్టమైన చర్యలు తీసుకున్నారని, కానీ ప్రస్తుతం చట్టంలో లేవు..తమ ధర్మం కాదనడం పేర్కొనడం సమంజసం కాదన్నారు. ఏపీ రాష్ట్రానికి ఆర్థికం..అభివృద్ధిలో న్యాయం జరగాలని, తెలంగాణలో అభివృద్ధిలో సహాయం చేస్తామని హామీనిచ్చారని తెలిపారు. కొన్ని జరిగాయి కానీ మరికొన్ని జరగలేదన్నారు. పవన్ చేసిన ప్రతిపాదనను తాను అంగీకరిస్తున్నట్లు, లోతైన వ్యూహంతో ముందుకెళ్లాలని..అదే తరుణంలో తెలుగు ప్రజల ఐక్యాన్ని కాపాడాల్సినవసరం ఉందన్నారు.

జేపీని అభిమానిస్తా - పవన్..
తాను ఎంతో అభిమానించే వ్యక్తుల్లో జేపీ ఒకరని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విభజన సమయంలో జరిగిన అన్యాయంపై దిశా..దశ నిర్ధేశం చేయాలని జేపీని కోరడం జరిగిందన్నారు. ఒక్క రోజులో అయ్యేది కాదని..ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు, భవిష్యత్ లో ఎలా వెళ్లాలనే దానిపై కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. 

Don't Miss