‘అజ్ఙాతవాసి' వర్కింగ్ టైటిల్ సాంగ్..

‘పవర్ స్టార్' పవన్ కళ్యాణ్...త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పవన్ సరసన క్తీరి సురేష్..అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'అజ్ఞాత వాసి' టైటిల్ పెట్టిన ప్రచారం జరుగుతోంది. చిత్రంలో 'పవన్' ఇంజినీరింగ్ కనిపించనన్నట్లు టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్..టీజర్ ఇంకా విడుదల కాకపోతుండడంతో పవన్ అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారంట. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ కంపోజింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా 'బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీయో క్లాక్...అనే పల్లవితో సాగే గీతాన్ని పూర్తిగా విడుదల చేశారు. ఈ పాట వీడియోను కార్టూన్ లిరిక్స్‌తో డిజైన్ చేసి అభిమానుల ముందు ఉంచారు. 2018 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.