చంద్రబాబు, లోకేష్ కు పవన్ సవాల్

21:42 - July 8, 2018

విశాఖ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... రాష్ట్ర మంత్రి లోకేశ్‌పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ లక్ష్యంగా సవాళ్లు విసురుతూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే  ఎమ్మెల్సీగా రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని విశాఖ పర్యటనలో జనసేనాని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే జనసేన సహించబోదని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. 
ముగిసిన పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటన   
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటన ముగిసింది. రంజాన్‌ సందర్భంగా గత నెలలో పర్యటనకు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌.. జూన్‌ చివరి నుంచి పునఃప్రారంభించారు. విశాఖ జిల్లాలోని పలు నియోజవర్గాలతోపాటు విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట పోరాట యాత్ర నిర్వహించారు. విశాఖ పర్యటనలో చివరి రోజు పలువురు ప్రముఖులు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి.. జనసేనలోకి ఆహ్వానించారు.
లోకేశ్‌, చంద్రబాబు లక్ష్యంగా పవన్ విమర్శల దాడి 
ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి పెంచారు. లోకేశ్‌ను దొడ్డి దారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. మంత్రి లోకేశ్‌కు ఏ అంశంపైనా విషయ పరిజ్ఞానం, సమస్యలపై అవగాహనలేదని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అవగాహన ఉంటే ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏ సమస్యపైనా చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. లోకేశ్‌, చంద్రబాబు, జగన్‌.. వస్తే కూర్చుని సమస్యలపై చర్చించడానికి సిద్ధమని జనసేనాని ప్రకటించారు. 
సామాజిక విప్లవం పోరాటం : పవన్ 
అణగారిని వర్గాలకు అందలం ఎక్కించేందుకే జనసేన అవిర్భవించిందన్న పవన్‌ కల్యాణ్‌... ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు డబ్బు, పదవిపై వ్యామోహం పోలేదని  వపన్‌ విమర్శించారు. చంద్రబాబు ఒక్కరే ఎదుగుతూ మిగిలిని వారిని అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. 
 

Don't Miss