పవన్ సినిమా పేరు 'దేవుడే దిగివచ్చినా' !...

15:13 - March 15, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' విడుదలకు సిద్ధమౌతోంది. ఈనెల 24న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్..టీజర్..ట్రైలర్ లు ఇప్పటికే విడుదలయ్యాయి. చిత్ర సాంగ్స్ కూడా రెండు రోజులకు ఒకటి విడుదల చేస్తున్నారు. ఇవి యూ ట్యూబ్ లలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. తాజాగా 'పవన్' నెక్ట్స్ సినిమాల పై అప్పుడే వార్తలు వెలువడుతున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా..తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. అయితే ఈ రెండింటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదట పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను ఈనెల 25వ తేదీన ప్రారంభిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రానికి 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో పవన్ సరసన క్తీరి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటించనున్నారు. ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Don't Miss