టీడీపీ నేతలకు ఇసుకంటే చాలా ఇష్టం అందుకే మాఫియాలు : పవన్ కళ్యాణ్

17:33 - May 29, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో తన పోరాట యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు..ఏ ప్రాంతానికి వెళ్లినా టీడీపీ నేతలు భూకబ్జాలు..ఇసుక మాఫీలకు పాల్పడతున్నారనే ఫిర్యాదులే వస్తున్నారనీ..తెలుగుదేశం నాయకులకు ఇసుకంటే చాలా ఇష్టమనీ కాబట్టే ఇసుక మాఫియాలకు పాల్పడుతున్నారనీ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం నుండి మాట్లాడితే ప్రభుత్వానికి వినిపించదనీ..కాబట్టి అమరావతికి వెళ్లి శ్రీకాకుళం వెనుకబాటు గురించి చెబుతానన్నారు. జన్మభూమి కమిటీల్లో అన్ని అవకతవకలేననీ..ఖచ్చితంగా జన్మభూమి కమిటీలను రద్దు చేయాల్సిన అవుసముందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సహాయం చేసిన వారి చేతులు నరికేయటం టీడీపీకి అలవాటనీ..అందుకే 2014లో తాను టీడీపీ మద్దతునిస్తే ఇప్పుడు తనను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్ని జిల్లాలను సమానంగా చూడాలని..కానీ వెనుకబడిన జిల్లాలను ఎందుకు పట్టించుకోవటంలేదని పవన్ ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలను పట్టించుకోకుండా రాజధాని కేంద్రంగా అభివృద్ధిని విస్తరిస్తున్నారనీ..అమరావతి వంటి ప్రదేశం పెద్ద పెద్ద నాయకులకే గానీ సామాన్యులకు కాదన్నారు. ప్రతీ జిల్లాలోను అభివృద్ధిని, ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. బీడు భూముల్లో నిర్మించాల్సిన పరిశ్రమలు పచ్చని పొల్లాల్లో నిర్మిస్తున్నారనీ దీంతో ఆ ప్రాంతంలోని పొలాలలే కాకుండా..నీరు కూడా కలుషితమైపోయి వివిధ రకాల రోగాలబారిన ప్రజలు పడుతున్నారనీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

Don't Miss