ఎన్నికలకు సిద్ధం కావాలన్న పవన్...

08:16 - May 28, 2018

శ్రీకాకుళం : 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. సామాజిక, రాజకీయ మార్పే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోరాట యాత్రలో జనసేనాని చెప్పారు. జిల్లాలోని నర్సన్నపేట, పాతపట్నం, ఆముదాలవలసలో జరిగిన జనసేన నిరసన కవాతులో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయని ప్రధాని మోదీ చర్యను తప్పుపట్టారు. వీటి సాధనలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

Don't Miss