పవన్‌ పర్యటన..తూ.గోదావరిలో వేడెక్కుతు రాజకీయాలు..

08:54 - November 8, 2018

తూర్పుగోదావరి : పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.  పవన్‌ పర్యటన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో కొత్త వివాదం రాజుకుంటోంది. కొంతకాలంగా పెద్దగా వార్తల్లో కనిపించని వంతాడ వ్యవహారం ఇప్పుడు పెనుదుమారం రేపేలా కనిపిస్తోంది. వంతాడలో భారీగా సాగుతున్న మైనింగ్‌ చుట్టూ తగాదా తారస్థాయికి చేరేలా కనిపిస్తోంది. అటు మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో కౌంటర్లు, ఇటు పవన్‌ కల్యాణ్‌ ఘాటు కామెంట్స్‌తో వంతాడ రాజకీయ మరింత వేడెక్కుతోంది.

Image result for pawan kalyan and lokeshవంతాడ మైనింగ్‌ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య వార్‌
 ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పవన్‌ పర్యటనతో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. పవన్‌ తన పర్యటనలో మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోంది. ప్రతీ మీటింగ్‌లోనూ లోకేష్‌ ప్రస్తావన లేకుండా పవన్‌ ప్రసంగం సాగడం లేదు. ఇక తాజాగా వంతాడ వ్యవహారంలో ఇద్దరు నేతలు నేరుగా తలపడుతుండడం ఆసక్తిగా మారింది. మైనింగ్ విషయంలో ఇద్దరు నేతల మధ్య ముదురుతున్న వివాదం చివరకు ఎక్కడకు దారితీస్తుందోననే చర్చ మొదలయ్యింది. వంతాడలో దశాబ్దకాలంగా మైనింగ్‌
అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ ఆధారాలు ట్వీట్‌ చేసిన పవన్‌.

Image result for vantada mainig in east godawariవంతాడలో మైనింగ్‌ గడిచిన దశాబ్దకాలంగా సాగుతోంది. అయితే అప్పట్లో మైనింగ్‌ నిర్వహించిన మహేశ్వరి మినరల్స్‌కి టీడీపీ అధికారంలోకి రాగానే చెక్‌ పెట్టారు. కాంగ్రెస్‌ హయాంలో  మహేశ్వరి మినరల్స్‌కు వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు స్వయంగా వంతాడలో ఉద్యమం నిర్వహించారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆండ్రూ మినరల్స్‌ కంపెనీకి మైనింగ్‌ అప్పగించారు. దీంతో ఈ కంపెనీ వెనుక టీడీపీ అధిష్టానంలోని కీలకనేత హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో ఇప్పుడు పవన్‌  టీడీపీ తీరును తప్పుపడుతున్నారు. పోలీసులు అభ్యంతరం తెలిపినా, మైనింగ్‌ కంపెనీ  అడ్డగోలుగా మట్టికుప్పలు వేసినా... వాటిని అధిగమించి వంతాడలో ఆయన అడుగుపెట్టారు. వంతాడ మైనింగ్‌ను పరిశీలించిన పవన్‌... చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్‌ తవ్వకాలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. దీంతోపాటు వంతాడలో అక్రమమైనింగ్‌ జరుగుతోందంటూ ఆధారాలు ట్విట్టర్‌లో జత చేశారు. 

Image result for vantada mainig in east godawariపవన్‌ ఆరోపణలపై ఏపీమంత్రి నారా లోకేష్‌ స్పందించారు.  పవన్‌ తీరును తప్పుపడుతూ కౌంటర్‌ ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. అవినీతి, అక్రమాలకు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు.. పవన్‌ పర్యటన చేసిన మరునాడే వంతాడలో విజిలెన్స్‌ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మొత్తానికి వంతాడ మైనింగ్‌పై ఇద్దరు నేతల మధ్య వార్‌ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాలోనే మరో 20 రోజులపాటు పర్యటిస్తానని చెబుతున్న పవన్‌. మైనింగ్‌పై మరింత చొరవ ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పవన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.

 
 
 

Don't Miss