పేటీఎం ఉపయోగించే వ్యాపారులకు గుడ్ న్యూస్...

17:38 - November 29, 2018

హైదరాబాద్ : పేటీఎం..పేటీఎం..డిజిటల్ లావాదేవీలు ఎక్కువైన తరుణంలో ఇది అందిరకీ చేరువైపోయింది. ఈ ఆన్ లైన్ పేమెంట్ యాప్ ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. టీ షాపు..కర్రీ పాయింట్స్..కిరాణా దుకాణాలు..చిన్న వ్యాపారులు కూడా పేటీఎం వాడుతున్నారు. వీరి అకౌంట్‌లోకి వెంటనే డబ్బు రాకపోవడంతో కొన్ని సమస్యలు ఎదుర్కొనే వారు. తాజాగా పేటీఎం యాజమాన్యం ఆ సమస్యకు చెక్ పెట్టింది. వారి వారి ఖాతాల్లోకి తక్షణమే డబ్బు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పేటీఎం చీఫ్ ఆపరేటింగ్ అధికారి కిరణ్ వాసిరెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 29వ తేదీ గురువారం వెల్లడించారు. కంపెనీ ‘ఇన్ స్టంట్ బ్యాంకు సెటిల్‌మెంట్’ ఆప్షన్ సదుపాయం పేటీఎం బిజినెస్ యాప్‌లో పొందుపర్చినట్లు..దీనిని ఉపయోగించి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వారి వారి ఖాతాలో జమ చేసుకోవచ్చన్నారు. దీనివల్ల 9.8 మిలియన్ వ్యాపారులకు లాభం కలుగుతుందని తెలిపారు.

Don't Miss