పెద్దపల్లి..సుల్తానాబాద్ లో టెన్షన్..

11:11 - January 17, 2018

పెద్దపల్లి : జిల్లాలోని సుల్తానాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. శ్రీరాంసాగర్ రెండు కెనాల్ల ద్వారా పెద్దపలి నియోజకవర్గానికి నీరందుతోంది. డీ 83, డీ 86 కెనాళ్లకు నీరు విడుదల చేయకపోడంతో చివరి ఆయుకట్టు రైతులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నీరు లేకపోవడంతో పంటలు బీడుగా మారిపోయాయి. గత వారం రోజుల క్రితం కాకతీయ కెనాల్ ద్వారా తమ తమ నియోజకవర్గాలకు నీటిని విడుదల చేయడంపై పెద్దపల్లి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిన విడుదల చేయాలంటూ మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా పెద్దపల్లి రైతులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే విజయ రమణ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనితో పోలీసులు ముందస్తు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయ రమణను గృహ నిర్భందం చేసి అరెస్టు చేశారు. సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మొక్కజోన్న పంట కోసం దున్నుకున్నారని, ఖరీఫ్ సీజన్ లో కూడా పంట సరిగ్గా చేతికందలేదని మాజీ ఎమ్మెల్యే విజయ రమణ పేర్కొన్నారు. అక్రమంగా మంత్రి ఈటెల నీటిని విడుదల చేసుకున్నారని, పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. 

Don't Miss