కంబల్‌ బాబాను గుడ్డిగా నమ్ముతున్న జనం

18:39 - September 13, 2017

ఛత్తీస్‌గడ్‌ : అత్యాచారం కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీం, ఆసారాం బాపు  జైలుశిక్ష అనుభవిస్తున్నప్పటికీ... బాబాల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడం లేదు. సాధారణ ప్రజలే కాదు... మంత్రులు సైతం బాబాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన హోంమంత్రి రామ్‌ సేవక్ పైక్‌రా షుగర్‌ వ్యాధిని నయం చేసుకోవడానికి కంబల్‌ బాబాను ఆశ్రయించాడు. ప్రజాయాత్రలో భాగంగా మంత్రి బలరామ్‌పూర్‌ జిల్లాలో ఉన్న కంబల్‌ బాబాను కలుసుకున్నారు. కంబల్‌ ఓఢాకర్‌ బాబా చెవిలో మంత్రం ఊదితే చాలు...ఎలాంటి రోగమైనా తగ్గిపోతుందట. దీనికో షరతు ఉంది. బాబా దర్బార్‌కు 5 సార్లు తప్పకుండా రావలసి ఉంటుంది. తన పర్యటనలో భాగంగానే బాబాను కలిశానని...ఆ చమత్కారమేంటో చూడ్డానికే వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఓ టీస్పూన్‌ చక్కెర ఇచ్చాడని...ఇందుకోసం బాబా నయాపైసా తీసుకోరని మంత్రి చెప్పారు. కంబల్‌ బాబా అసలు పేరు గణేష్. భుజాన గొంగడి వేసుకోవడంతో కంబల్‌ బాబాగా మారారు. 28 ఏళ్లుగా ఇలా చికిత్స చేస్తున్నాడు. 

 

Don't Miss