పోలవరం ప్రాజెక్టు రైతుల ఆందోళన..16మంది అరెస్ట్..

14:49 - January 10, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతీ రెండు రోజులకు ఒకసారి ఆందోళన కొనసాగుతోంది. పోలవరం పరిధిలోని మూలలంక రైతులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లో మట్టిని డంపింగ్ చేస్తున్నారని పనులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన 16 మంది రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమ సమస్యలు పరిష్కరించకుండా పనులు చేపట్టటంపై ఆ ప్రాంత నిర్వాశితులు..రైతులు ఆందోళన చేపడుతున్నారు. దీంతో ప్రాజెక్టు పనులు దాదారు ఆరు గంటలపాటు మిషనరీ నుండి మట్టి తరలించే లారీ సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత ఆరు నెలలలుగా మూలలంక ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తునే వున్నారు. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి తవ్విన మట్టిని మూలలంక ప్రాంతానికి ప్రతీరోజూ 60వేల మెట్రిక్ టన్నుల మట్టిని తరలిస్తున్నారు. మూలలంక గ్రామంలోని 205 ఎకరాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనికి సంబంధించి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మట్టిని తరలించటంపై ఆప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని భూ నిర్వాశితులు ఆందోళన చేపడుతు డిమాండ్ చేస్తున్నారు.

Don't Miss