మియాపూర్‌ పీఎస్‌కు సాయికిరణ్‌

15:45 - September 13, 2017

హైదరాబాద్ : చాందిని హత్యకేసు నిందితుడు సాయికిరణ్‌ను మియాపూర్‌ పీఎస్‌కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందుకు సాయికిరణ్‌ను ప్రవేశపెట్టనున్నారు. చాందిని హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. మరోవైపు సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చాందిని హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. చాందినీని తానే చంపినట్లు సాయికిరణ్‌ అంగీకరించారు. 2015 నుంచి తాను, చాందిని ప్రేమించుకుంటున్నామని తెలిపారు. చాందిని ప్రవర్తన నచ్చక ఆరు నెలలుగా దూరం పెట్టా నని తెలిపారు. తన వెంట పడొద్దని చాందినీకి చాలాసార్లు చెప్పానని చెప్పారు. పదేపదే తన వెంట పడటంతో వదిలించుకోవాలనుకున్నానని తెలిపారు. హత్య జరిగిన స్థలానికి సాయికిరణ్‌ను పోలీసులు తీసుకెళ్లారు. హత్య జరిగిన సీన్‌ను పోలీసులు రీ కన్‌స్ర్టక్షన్‌ చేశారు.
సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలి: చాందిని తల్లి
చాందినిని హత్య చేసి అనంతరం నిందితుడు సాయికిరణ్ తమ ఇంటికి వచ్చినట్లు చాందిని పేరెంట్స్ చెబుతున్నారు. సాయికిరణ్ హత్య చేశాడని తెలిసి షాకయ్యామని చాందిని తల్లి అన్నారు. హత్యలో అతనికి మరికొందరు సాయం చేసినట్లు భావిస్తున్నామని ఆమె ఆరోపించారు. సాయికిరణ్‌ను కఠినంగా శిక్షించాలని చాందిని తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఇక సాయి కిరణ్‌ తానే నేరం చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. 2015 నుంచి చాందిని తను ప్రేమించుకుంటున్నామని .. ఆమె ప్రవర్తన నచ్చక 6 నెలల నుంచి దూరం పెట్టానని సాయికిరణ్‌ పోలీసులకు తెలిపాడు. అయితే చాందిని హత్య వెనుక సాయికిరణ్‌కు ఎవరెవరు సహకరించారనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చాందిని అక్క తాను కూడా చాందిని చదివిన స్కూల్‌లోనే చదివానని తెలిపింది. సాయికిరణ్‌, చాందిని క్లాస్‌మేట్ అని తెలుసని, ఇలా చంపేస్తాడని అనుకోలేదని చెప్పింది. ఏ ప్రాబ్లమైనా షేర్‌ చేసుకునేదని, లోలోపల ఇంత ఒత్తిడికి గురవుతోందని తెలీదని ఆవేదనకు గురైంది.
నా కూతురిని చంపడానికి అతనికేం హక్కు ఉంది : చాందిని తల్లి 
సాయికిరణ్‌ చిన్నప్పటి నుంచి చాందినితో కలిసి చదువుకున్న అబ్బాయి కావడంతో.. తమకెలాంటి అనుమానం రాలేదని చాందిని తల్లి తెలిపారు. తమ కూతురిని చంపడానికి అతనికేం హక్కుందని ఆమె ఆవేదనకు గురయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

Don't Miss