సీఐ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

11:47 - January 12, 2017

గుంటూరు : సీఐ వేధిస్తున్నాడని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని కొత్తపేట మండలం పోలీసు స్టేషన్ లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెల రోజుల క్రితమే డ్యూటీలో జాయిన్ అయిన సీఐ వెంకటేశ్వర్లును కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో వెంకటేశ్వర్లు పీఎస్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు. వెంకటేశ్వర్లు తన వెంబడి తెచ్చుకున్న నిద్రమాత్రలను సీఐ సమక్షంలోనే మింగాడు. తోటి కానిస్టేబుళ్లు 
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వెంకటేశ్వర్లు మింగిన నిద్రమాత్రలను కక్కించారు. ప్రాణ అపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై సీఐ స్పందించ లేదు. సీఐ కానిస్టేబుళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడనే ఆరోపణ వినిపిస్తోంది. అలాగే సెలవులు ఇవ్వడం లేదని, కొంత ఆలస్యంగా వచ్చినా కూడా సీఐ మందలిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss