రంగారెడ్డిలో కార్డన్ సెర్చ్...

09:06 - April 29, 2018

రంగారెడ్డి : జిల్లాలో పోలీసులు పలుచోట్ల కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎన్‌టీఆర్‌ కాలనీ, బంజారా కాలనీల్లో నిర్వహించిన తనిఖీల్లో 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలులేని 40 ఆటోలు, 26 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇక శంషాబాద్‌లోని హైమద్‌నగర్‌, ఖాజాగల్లి, కోమటిబస్తీల్లోనూ నిర్బంధ తనిఖీలు కొనసాగాయి. 30 మంది అనుమానితులతోపాటు... 100 బైక్‌లు, 20 ఆటోలు, 3 కార్లు, 3 డీసీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Don't Miss