ఉద్రిక్తతంగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ

08:35 - August 27, 2017

సిద్దిపేట : ప్రాజెక్టులపై ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా సిద్ధిపేట జిల్లాలో కాళేశ్వరం కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది.. ఈ కార్యక్రమానికి వచ్చిన వేములఘాట్‌ గ్రామస్తులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. అరెస్ట్‌ చేసిన గ్రామస్తులను పోలీసులు రాజగోపాలపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.రైతుల అరెస్ట్‌ను నిరసిస్తూ TDP ధర్నా చేపట్టింది.. ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో రంగదాంపల్లి చౌరస్తా దగ్గర నిరసన చేపట్టారు.. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు మాట్లాడుతుంటే మైక్‌ ఎలా కట్‌ చేస్తారని మండిపడ్డారు.. తమ సమస్యలను చెప్పకముందే నిర్వాసిత రైతుల్ని ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. అరెస్ట్ చేసిన అన్నదాతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 పెద్దసంఖ్యలోప్రజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోకూడా కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.. ప్రాజెక్టు నిర్మాణంపై రైతులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు స్వీకరించేందుకు కేంద్రంనుంచి అధికారుల బృందంకూడా ఈ సమావేశానికి హాజరైంది.. పలువురు స్థానికులు, రైతులు తమ సమస్యలను ఈ సమావేశంలో వినిపించారు.. ఈ కార్యక్రమంలోపాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు సమావేశ నిర్వహణ సరిగాలేదని ఆరోపించారు.. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీ సభగా ఉందని నినాదాలు చేశారు.. వీరందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.జయశంకర్‌ భూపాలపల్లిలోనూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 20 మండలాలనుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు.. కాళేశ్వరం ప్రాజెక్టు గ్రామాలైన మహదేవ్‌పూర్‌, అన్నారం, మేడిగడ్డ గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో సమావేశానికి వచ్చారు.. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా కలెక్టర్‌ మురళి, జాయింట్‌ కలెక్టర్‌, పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది.. కాళేశ్వరం నిర్మాణంద్వారా వేలాదిమంది రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.. అయితే 2013 భూసేకరణ చట్టంప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌ బాబు డిమాండ్ చేశారు.రైతుల అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నివర్గాల వారూ మద్దతు తెలిపారని ప్రకటించుకుంది. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే 15 జిల్లాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

కాంగ్రెస్‌ విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సాగిన ప్రజాభిప్రాయ సేకరణపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.. ఇవి టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బహిరంగ సమావేశాల్లా ఉన్నాయంటూ ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సాగిన ప్రజాభిప్రాయ సేకరణపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.. ఇవి టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బహిరంగ సమావేశాల్లా ఉన్నాయంటూ ఆక్షేపించింది.

 

Don't Miss