బాలుడు దొరికాడు...

12:38 - January 31, 2018

హైదరాబాద్ : జీడిమెట్ల పీఎస్ పరిధిలో గత కొన్ని రోజులు కింద అదృశ్యమైన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. కిడ్నాపర్లు బాలుడిని వదిలి వెళ్లిపోయారు. ఓ కుటుంబం కుమారుడు ఉదయ్ తేజతో చిత్తారమ్మ జాతరకు వచ్చింది. అనంతరం జాతరలో ఉదయ్ అదృశ్యమయ్యాడు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లిదండ్రులు పలు ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకి లభించలేదు. చివరకు పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు. జీడిమెట్ల సీఐ ఆధ్వర్యంలో 11 బృందాలు గాలింపుల్లో పాల్గొన్నాయి. కిడ్నాప్ అయిన అనంతరం 23వ తేదీ నుండి టెన్ టివిలో వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనితో కిడ్నాపర్లు భయాందోళనలకు గురయినట్లు సమాచారం. సిద్ధిపేటలో బాలుడిని వదిలేశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. బాలుడిని గుర్తు పట్టకుండా ఉండేందుకు గుండు కొట్టించినట్లు తెలుస్తోంది. చివరకు బాలుడు క్షేమంగా ఉన్నాడనే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 

Don't Miss