కోళ్ల పందాలు..టెన్షన్..టెన్షన్...

18:11 - January 13, 2018

పశ్చిమగోదావరి : సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంబరాల్లో ప్రముఖంగా పేర్కొనే కోళ్ల పందాలపై ఉత్కంఠ నెలకొంటోంది. సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని కొంతమంది..నిర్వహించవద్దని పోలీసుల హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని ద్వారకా తిరుమలలో కోడి పందాల బరులపై పోలీసులు దాడులు చేశారు. బరుల ఏర్పాటుకు స్థలం ఇచ్చిన రైతులపై కేసులు నమోదు చేశారు. భీమడోలు, చాగల్లు మండలాల్లో దాడులు చేశారు. ఎక్కడా కోళ్ల పందాలు జరుగవద్దని పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి పీఎస్ లో మూడు టీంలుగా విభజించి రైడ్స్ నిర్వహించడం జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు. గతంలో పందాలు జరిగిన ప్రదేశాలను గుర్తించడం..కొత్తగా ఏర్పాటు చేసిన బరులను గుర్తించి దాడులు చేయడం జరుగుతోందన్నారు. ఒక్కో డీఎస్పీ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు గస్తీలు..సోదాలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని..హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పందాలను అడ్డుకుంటామన్నారు.

పందాలు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రవి ప్రకాష్ పేర్కొన్నారు. ఏలూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పందాలపై జాయింట్ యాక్షన్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని, పందాలకు సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతినివ్వలేదని, హైకోర్టు ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామన్నారు. 

Don't Miss