భారీ పాత నోట్లు లభ్యం

19:44 - September 13, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో రద్దైన పాత నోట్లను పోలీసులు పట్టుకున్నారు. పాత నోట్లను మార్చేందుకు నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులు రెండు కార్లలో తిలక్‌ రోడ్డులో తిరుగుతుండగా అనుమానించిన పోలీసులు వారిని ప్రశ్నించగా... ఆ మూఠా తప్పించుకునే ప్రయత్నం చేసింది. మూఠాలో ఒకరు పారిపోగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాడేపల్లి గూడానికి చెందిన వంగా దుర్గ, కొడవటి ఈశ్వర్రావులు రాజమహేంద్రవరంలో కోటి రూపాయల పాత నోట్లకు 25 లక్షల కొత్త కరెన్సీ చెల్లించే విధంగా ఒప్పందంతో నోట్లు మార్చుకునేందుకు వచ్చినట్టు నిందుతులు తెలిపారు. అయితే ఈ నోట్లను కోర్టులో ప్రవేశపెట్టామని, కోర్టు అనుమతితో తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

Don't Miss