భారీ ఎన్ కౌంటర్ లో 14మంది మావోలు మృతి..

15:55 - August 6, 2018

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందా ? మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పై చేయి సాధిస్తున్నారా ? అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజం అనిపిస్తోంది. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ ఘటన మరిచిపోకముందే మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా గొల్లపల్లి - కుంట మధ్య పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు తారసపడడం..ఇరువురి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో పోలీసుల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. మావోయిస్టుల మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

Don't Miss