ఆకతాయిలను చితక్కొట్టిన పోలీస్...

13:12 - February 14, 2018

పశ్చిమగోదావరి : శివరాత్రి సందర్భంగా ఆచంటలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేడుకలకు హాజరైన మహిళల పట్ల కొంతమంది ఆకతాయి విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించడం..కామెంట్స్ చేశారని కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తీసుకొచ్చి విద్యార్థులను విచారించారు. ఒక్కసారిగా రెచ్చిపోయిన ఓ పోలీసు విద్యార్థులను చితకబాదాడు. అక్కడకు చేరుకున్న మీడియా చితక్కొడుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. దీనిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఉత్సవాల్లో తమ ఎదుటే అసభ్యకరంగా ప్రవర్తించారని...విద్యార్థులు పొంతనలేని సమాధానం చెబుతున్నారని పోలీసులు పేర్కొంటున్నట్లు సమాచారం. 

Don't Miss