వేధింపుల కేసులో ‘రంభ'కు సమన్లు..

09:42 - January 12, 2017

టాలీవుడ్ లో అప్పట్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో 'రంభ' ఒకరు. అగ్రహీరోలతో నటించిన 'రంభ' ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. వర్నకట్నం వేధింపుల కేసులో ఆమెకు పోలీసులు సమన్లు అందచేశారు. 'రంభ' సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం జరిగింది. తనను భర్త...అత్తమామలు..ఆడపడుచు (రంభ) వేధించారంటూ 2014 జులైలో పల్లవి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో ముగ్గురిపై కేసు నమోదైంది. ‘రంభ'కు సమన్లు అందచేయాలని పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. అమెరికాలో 'రంభ' ఉండడంతో వీలు కాలేదని తెలుస్తోంది. చివరకు పోలీసుల నిరీక్షణ ఫలించింది. ఓ టీవీ ఛానల్ రియాల్టీ షో కోసం 'రంభ' హైదరాబాద్ కు చేరుకుంది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. అనంతరం అక్కడున్న 'రంభ'కు సమన్లు అందించారు. మరి ఈ సమన్లపై 'రంభ' ఎలా స్పందిస్తుందో చూడాలి.

Don't Miss