ఏపీలో ప్రత్యేక హోదా రగడ

21:29 - February 14, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఇపుడు రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించింది. మంగళవారం నెల్లూరు జిల్లా కలికిరి సభలో.. జగన్‌ చేసిన రాజీనామా కామెంట్లు రాజకీయ కాకను పెంచేస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ - వైసీపీ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. ద్రోహులు మీరంటే.. మీరేనంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఎంపీల రాజీనామాలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారన్న జగన్‌ ప్రకటన నేపథ్యంలో.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పార్టీ నేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయం.. వైసీపీ తీసుకున్న రాజీనామాల నిర్ణయంపై విస్తృతంగా చర్చించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు జగన్‌పార్టీపై ఘాటు విమర్శలకు దిగారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఏప్రిల్‌ ఆరువరకు ఆగకుండా తక్షణమే తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్‌ విసిరారు. వైసీపీ ఎంపీల రాజీనామా బెదిరింపులు కేంద్రాన్ని కదిలించలేవని.. ఎద్దేవా చేశారు.

త్యాగానికి సిద్ధపడుతున్న వైసీపీ ఎంపీలపై నిందలా
టీడీపీ నేతల విమర్శలను వైసీపీ నాయకులు అంతేస్థాయిలో తిప్పికొట్టారు. రాజీనామాలతో రాష్ట్ర ప్రజలకోసం త్యాగానికి సిద్ధపడుతున్న వైసీపీ ఎంపీలపై నిందలు తగదంటూనే.. పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేక.. సభ బయటికొచ్చి మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా... సుదీర్ఘ విరామం తర్వాత మరోమారు సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రాన్ని సంధించారు. జనసేన అధినేత భుజంపై ప్రత్యేక హోదా తుపాకీ పెట్టి మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసే డ్రామాకు తెరతీశారని ముద్రగడ తన లేఖలో ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన మొదట్లో ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అంటూ తమరు వ్యాఖ్యానించలేదా అని ముద్రగడ లేఖలో ప్రశ్నించారు. తనతోపాటు బీజేపీ నేతలు సోమువీర్రాజు, పురంధ్రీశ్వరి లాంటి వారు.. జగన్‌కు అమ్ముడుపోయారన్న టీడీపీ నేతల విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని పాలకపక్షం విమర్శించడంపైనా ముద్రగడ అభ్యంతరం తెలిపారు. మొత్తానికి వైసీపీ ఎంపీల రాజీనామాల ప్రకటనతో ..ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నా.. అధికార- ప్రతిపక్షాలు మాటల యుద్ధాన్ని ముమ్మరం చేశాయి.  

Don't Miss