అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

19:02 - May 19, 2017

క‌డ‌ప‌: అగ్రిక‌ల్చరల్‌ కాలేజీ విద్యార్థిని నాగ‌మ‌ల్లిక ఆత్మహ‌త్య కలకలం రేపింది. గురువారం రాత్రి హాస్టల్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన తోటి విద్యార్థినులు కళాశాల అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు, సిబ్బంది వచ్చేసరికే నాగ‌మ‌ల్లిక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం కడప రిమ్స్ మార్చురీలో మృత‌దేహాన్ని ఉంచారు. నాగ‌మ‌ల్లికది అనంతపురం జిల్లా తాడిపత్రి మండ‌లం కొండాపురం గ్రామం. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Don't Miss