ఖమ్మం మున్సిపల్ సమావేశం రచ్చ..రచ్చ...

13:36 - January 31, 2018

ఖమ్మం : మున్సిపల్ సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. అధికార..విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం..ఆందోళనతో సమావేశం దద్దరిల్లింది. సుదీర్ఘకాలం అనంతరం బుధవారం సమావేశం ఏర్పాటైంది. సమావేశంలో అధికార...విపక్ష సభ్యులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని కాంగ్రెస్ కార్పోరేటర్ లు లేవనెత్తారు. దీనితో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. వెంటనే ఎమ్మెల్సీ పొంగులేటి జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడియం ఎదుట ఇరుపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనితో సమావేశం రసాభాసగా మారిపోయింది. 

Don't Miss